- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ లేకపోతే కోహ్లి లేడు: గంభీర్
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి ఇటు బ్యాట్స్‌మన్‌గా రికార్డులు సృష్టిస్తూనే విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకుంటున్నాడు. కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తర్వాత బాధ్యతలు అందుకున్న కోహ్లి అంచనాల మేరకు రాణిస్తున్నాడు. అయితే, అతని విజయం వెనుక ధోనీనే ఉన్నాడని, ఒకానొక పరిస్థితిలో ధోనీ అండ లేకుండా ఉంటే ఇప్పటికే కోహ్లి కనుమరుగయ్యే వాడని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ‘టీమ్‌ఇండియాలో స్థానం దక్కాలంటే ఎప్పుడూ తీవ్రమైన పోటీ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆటగాడు విదేశాల్లో విఫలమైతే అతడిని కచ్చితంగా తీసేస్తారు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన కోహ్లి కేవలం 134 పరుగులే చేశాడు. ఆ తర్వాత సిరీస్‌కు అతడిని పక్కన పెడతారని అందరూ భావించారు. కానీ, ఎంఎస్ ధోనీ అతడికి చాన్స్ ఇచ్చాడు. కోహ్లి పూర్తి ఫామ్ అందుకునే వరకు అతనిపై ఈగ కూడా వాలనివ్వకుండా ధోనీ చూసుకున్నాడు. అందుకే మనం ఇవాళ కోహ్లిని ఒక గొప్ప క్రీడాకారుడిగా చూడగలుగుతున్నాం’ అని గంభీర్ చెప్పాడు. ఒక మంచి క్రికెటర్‌ను గుర్తించడంలో ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. ఆ పనే కోహ్లి విషయంలోనూ చేశాడని గంభీర్ అన్నాడు.