- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఆ రోజు ప్రపంచ రికార్డు సృష్టిస్తా’
దిశ, అంబర్‌పేట్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బర్కత్‌పుర జీవీఆర్ కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్న కరాటే బ్లాక్ బెల్ట్ సంతోషిని రెడ్డి ఈనెల 31వ తేదీన వరల్డ్ రికార్డ్ చేయనున్నారని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బర్కత్‌పుర అకాడమీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 7 సంవత్సరాలు (84నెలలు) పూర్తి అవుతున్న సందర్భంగా 84 టైల్స్ ను 84 సెకండ్లలో సంతోషిని తన పంచ్‌లతో బ్రేక్ చేసి రికార్డు నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పాల్గొని రికార్డ్స్ ను నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. ఘన సంతోషిని 2014లో బాలసూర్య స్టేట్ అవార్డు గెలుచుకున్నారు. 2019లో తన అక్క అమృత రెడ్డి తో కలిసి ఘన సంతోషిని రెడ్డి వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పారు.