పవన్ అభిమానినంటూ యువతి పేరుతో వల

దిశ, వెబ్‌డెస్క్: పవన్ అభిమానిని అంటూ ఓ వ్యక్తి అమ్మాయిలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అందరినీ మోసం చేశాడు. అలేఖ్య‌రెడ్డి పేరుతో అందమైన అమ్మాయి ఫోటో పెట్టి ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేశాడు. దీంతో ఆమెను అందరూ ఆకాశానికి ఎత్తారు. ఏకంగా 37వేలమంది ఫాలోవర్స్ పోగయ్యారు. ఎంతలా అంటే రక్షాబంధన్‌కు రాఖీ కట్టవా అంటే అలాగే అన్నయ్య అని నమ్మించాడు. కానీ చివరకు ఓ జన సైనికుడి చేతిలో బుక్కై కాళ్ల బేరానికి వచ్చాడు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదే క్రమంలో ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ బుక్ చేయగా.. డెలివరీ అయ్యే సమయానికి అసలు రంగు బయట పడింది. సరస్వతి పేరుతో ఎవరూ లేరని.. ఫోన్ ఇవ్వాలంటే అబ్బాయి మాట్లాడుతున్నాడని, అక్క ఆస్పత్రికి వెళ్లిందని చెబుతున్నారని డెలివరీ బాయ్ సంబంధిత వ్యక్తికి చెప్పాడు. దీంతో మొత్తం ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఆ అకౌంట్ ను వాడేది అబ్బాయి అని తెలియడంతో అతడు కాళ్ల బేరానికి దిగాడు. చివరికి ఐడీ బ్లాక్ చేసుకొని పరారయ్యాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అతనికి ఆ అకౌంట్‌తో ఫ్యాన్ క్లబ్ కూడా ఉంది.

Advertisement