- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను ఎదుర్కొవడంలో కేంద్రం విఫలం: సీపీఎం
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ విపత్కర సమయంలో కేంద్ర, రాష్ట్రాల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈనెల 16న నిరసన పాటించాలని సీపీఎం కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మంగళవారం నిరసనలు తెలపాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటన చేశారు. లాక్‌డౌన్‌లో కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో, ప్రజలను ఆదుకోవడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. ఆపత్కాలంలో పేద ప్రజల, వలస కార్మికుల ఇబ్బందులను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నిపుణులు, రాజకీయ పార్టీలు సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని ఆరోపించారు. కరోనా టెస్టులు, వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిరసన వ్యక్తం చేస్తామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.