సొంత రాష్ట్రంలో హాస్టళ్లకు సొంత భవనాలు కరువు : CPM

by Aamani |
CPM leaders
X

దిశ, ఆసిఫాబాద్ రూరల్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆశించామని, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలపై, బార్లపై ఉన్న శ్రద్ధ విద్యారంగంపై లేదని విమర్శించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి పరంగా ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, వెనుకబడిన జిల్లా కనుక విద్యా వవ్యస్థను బలోపేతం చేయాలని కోరారు.

జిల్లాలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లకు సొంత భవనాలు లేక ఇరుకు గదుల్లో మగ్గుతున్నారని అన్నారు. సొంత రాష్ట్రంలో హాస్టళ్లకు సొంత భవనాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున వెంటనే SC, ST, BC, మైనార్టీ హాస్టళ్లలో అదనపు గదులు నిర్మించి, తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తిక్, దుర్గం రాజ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed