- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రిగారు తేల్చండి.. భద్రాచలం మున్సిపాలిటీనా.. గ్రామపంచాయతా?
దిశ, భద్రాచలం టౌన్: మంత్రి మహాశయా..! భద్రాచలం మున్సిపాలిటీనా? లేక గ్రామపంచాయతీనా? అనేది ప్రభుత్వం వెంటనే తేల్చాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కి విన్నవించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం భద్రాచలానికి వచ్చిన మంత్రిని సీపీఎం మండల కార్యదర్శి గడ్డం స్వామి నేతృత్వంలో బృందం వినతిపత్రం అందజేశారు. గతంలో గ్రామపంచాయతీగా ఉన్న భద్రాచలాన్ని మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి ప్రత్యేక అధికారిని నియమించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత మున్సిపాలిటీల జాబితాలో చేర్చకపోవడంతో పట్టణ ప్రజలు గందరగోళంలో ఉన్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినా భద్రాచలం ఏ కోవలో ఉందో తెలియక ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు.
పాలకమండలి లేనందున ఆశించిన అభివృద్ధి జరగడంలేదన్నారు. ఈ విషయమై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలని కోరారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన భద్రాచలం పట్టణానికి పెనుప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వరద ముంపు అంచనాలతో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పోలవరం భయం భద్రాచలం వాసుల్లో నెలకొందని గుర్తుచేశారు. వర్షాకాలంలో భద్రాద్రి ఏజెన్సీ ప్రజలు అధిక వర్షాలు, గోదావరి, పోలవరం వరదల వలన ఆస్థి, ప్రాణనష్టం జరగకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో అధికార యంత్రాంగం సిద్ధం కావాలని వినతిపత్రం ద్వారా విజ్ఞప్తిచేశారు. మంత్రిని కలిసిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, ఎంబి నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, బండారు శరత్‌బాబు ఉన్నారు.