తెలంగాణలోనూ ‘ఈఎస్ఐ’ నిందితులు శిక్ష అనుభవిస్తున్నారు: మధు

by srinivas |
తెలంగాణలోనూ ‘ఈఎస్ఐ’ నిందితులు శిక్ష అనుభవిస్తున్నారు: మధు
X

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణలోనూ ఈఎస్ఐ కుంభకోణం నిందితులు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారని సీపీఎం నేత మధు గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టుపై ఆయన మాట్లాడుతూ.. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందనీ, స్కామ్‌కు సంబంధించి సాక్ష్యాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో నిందితులు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ ఏపీలో కొంచెం ఆలస్యమైందని చెప్పారు. ఇక్కడ కూడా విచారణ జరిపిన తర్వాతే అరెస్ట్ చేశారని, అచ్చెన్నాయుడు ఇచ్చిన లేఖ ఆధారంగానే అరెస్టులు జరిగాయని తెలిపారు. అయితే, విచారణ సక్రమంగా జరగాలని, ఇందులో రాజకీయ జోక్యం ఉండకూడదని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed