విద్యుత్ మీటర్లు పెడితే తిరుగుబాటు తప్పదు

by srinivas |
విద్యుత్ మీటర్లు పెడితే తిరుగుబాటు తప్పదు
X

దిశ, విశాఖపట్నం: వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడితే తిరుగుబాటు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తే శ్రీకాకుళం జిల్లా నుంచే మా ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత అన్నింటిలోనూ రివర్స్‌లో వెళ్తున్నారని, ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడటానికే విద్యుత్ మీటర్ల ఏర్పాటు ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. పవర్ పర్చేజ్ ఒప్పందాల్లో చంద్రబాబు చేసిన అగ్రిమెంట్ తప్పైతే, మీరు చేసిది ఏమిటిని ప్రశ్నించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed