ఇంత జరుగుతున్నా.. జగన్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదు

by srinivas |
CPI Leader Ramakrishna
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కదిరిలో 24 గంటల్లో కరోనాతో 8 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కదిరి ప్రాంతంలో 24 గంటల్లోనే ఇంత మంది మరణించడం చాలా బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రామకృష్ణ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించడంతో పాటు.. ప్రభుత్వంపై ప్రశ్నలు, విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నా.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రమంతటా మృత్యు ఘంటికలు మోగుతున్నా.. జగన్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed