సీఎం జగన్‌ది వితండవాదం : రామకృష్ణ

by srinivas |
సీఎం జగన్‌ది వితండవాదం : రామకృష్ణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధానిగా ఉండాలనే అందరం పోరాటం చేస్తున్నామని గుర్తుచేశారు. మూడు రాజధానులపై జగన్ వితండవాదం చేస్తున్నాడని మండిపడ్డారు. అమరావతి సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నిద్దామని స్పష్టం చేశారు. అమరావతిల అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని తెలిపారు. రాజధాని కోసం పోరాడుతున్న రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో పేదలకు జగన్ ఇళ్లు ఇస్తుంటే ఎవరూ అడ్డుపడరని అన్నారు.

Next Story

Most Viewed