‘బిగ్‌బాస్ షో’ పై సీపీఐ నారాయణ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వ్యాఖ్యాతగా ప్రారంభమైన ‘బిగ్‌‌బాస్‌ షో’పై సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు. విజయ్ మాల్యా జీవించే భవనాలు ఎంత విలాసంగా ఉన్నాయో, అంతకు మించి బిగ్‌బాస్ హౌస్ ఉందన్నారు. యువతీ యువకులను అక్కడకు తీసుకువచ్చి, 100 రోజులు దాచి పెట్టి.. ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని అన్నారు. బిగ్‌బాస్ షోను చూస్తుంటే హియాలయాల్లో ఉన్న సాంస్కృతిక సంఘాన్ని తీసుకువచ్చి మురికి కుంటలో పడేసినట్లు ఉందని విమర్శించారు. సినిమాలో హీరోయిన్ల ఫోటోలను చూపించి వారి గురించి చెప్పమంటారని, అప్పుడా యువకుడు ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకొని, వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తా, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెబుతాడని, ఇదేనా మీరు యువతకు ఇచ్చే సందేశమని ప్రశ్నించారు. కళామతల్లికి అన్యాయం చేస్తూ అవమానపరుస్తున్నారని ఇలాంటి షోలను ప్రజలు ఆదరించొద్దన్నారు.

Advertisement