భారత ఆర్ధిక స్వాతంత్య్రం దెబ్బతింటోంది: సిపిఐ  నారాయణ

by srinivas |
narayana
X

దిశ-ఉత్తరాంధ్ర: కేంద్ర విధానాలకు నిరసనగా విశాఖపట్నంలో సిపిఐ జనాందోళన్ సభ కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి సిపిఐ నారాయణ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర విధానాల వల్ల భారత ఆర్ధిక స్వాతంత్య్రం దెబ్బతింటోందన్నారు. ఇటీవల 9 వేల కోట్ల డ్రగ్స్ విజయవాడలో పట్టుకున్నారని, గుజరాత్ లోని ముంద్రా పోర్టు నుంచి అది అన్ లోడ్ అయ్యిందన్నారు. దీని వలన భారత ఆర్ధిక స్వాతంత్య్రం దెబ్బతింటోందన్నారు. తీర ప్రాంతాన్ని అదానీ గుప్పెట్లోకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇక నుండి తీరప్రాంతంలోని పోర్టుల్లోకి అసాంఘీక చర్యలకు అడ్డు అదుపు వుండదన్నారు.

తిరుపతి ఎయిర్ పోర్టు అమ్మేస్తున్నారని, హైవేలని కూడా అమ్మేస్తున్నారనీ కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు బూతుల పురాణాలు పక్కన పెట్టాలని ఎక్కడా కూడ ఇంతటి అసహ్యమైన భాషను నేను చూడలేదన్నారు. తెలుగు రాష్ట్రాలను దోచుకోడానికి కేంద్రం పన్నాగం పన్నుతోందన్నారు. కేంద్రంపై పోరాటానికి తెలుగు రాష్ట్రాలు సిద్దపడాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సెక్టార్లో కూడా తమకు కావాల్సిన వ్యక్తులకే కట్టబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. నిన్న విడుదలైన జడ్పీటీసి, ఎమ్పీటీసి ఎన్నికల్లో వైసిపి గెలుపు ఉత్సవాలు హాస్యాస్పదమన్నారు. వైసీపీ గెలుపు ఎదటివారికి చేతులు, కాళ్లు కట్టేసి మల్లయుద్దంలో గెలవడంలా వుందని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed