దేశంలో రాజ్యాంగబద్ధ పాలన లేదు : సీపీఐ నారాయణ

by  |
దేశంలో రాజ్యాంగబద్ధ పాలన లేదు : సీపీఐ నారాయణ
X

దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలన సాగడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశ పరిపాలనా అంశాల్లో ఆర్మీ కలుగజేసుకోవడాన్ని సీపీఐ తప్పుబట్టింది. పార్లమెంట్ వ్యవస్థను ధ్వంసం చేసే విధంగా మోడీ పాలన సాగుతోందని విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశ ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారిందన్నారు. రిలయన్స్ కోసం ఎల్ఐసీని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. సుష్మాస్వరాజ్‌ను అవమానించే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. దేశ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో చెప్పినవన్నీఅబద్ధాలే అని నారాయణ విమర్శించారు.

ఈ నెల 10న అన్ని వామపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రాష్ర్టవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నామన్నారు. ప్రాణహిత చేవెళ్ల, కాళేశ్వరం జాతీయ హోదాపై కేసీఆర్ మౌనం వీడాలన్నారు. బడ్జెట్ ప్రసంగంలో మోడీ తెలంగాణపై విషంగక్కారని చాడ తెలిపారు.


Next Story