గచ్చిబౌలి టిమ్స్‌ను ప్రారంభించాలి: చాడ

దిశ, న్యూస్‌బ్యూరో: గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యసేవలు ఎందుకు ప్రారంభించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టిమ్స్ ప్రారంభంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఛలో టిమ్స్ కార్యక్రమానికి వెళ్తున్న సీపీఐ నేతలను, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని పోలీసులకు అప్పజెప్పి ఫామ్‌హౌస్‌లో ఉన్నారని మండిపడ్డారు. ఏపీలో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేసి ఆరోగ్య శ్రీలో చిక్సిత అందిస్తున్నారని, మన రాష్ట్రంలో మాత్రం కరోనా సోకిన వారికి బెడ్‌లు దొరకని పరిస్థితి ఉందన్నారు.

Advertisement