- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కన్నీళ్లు, ఆకలి ఉన్నన్ని రోజులు వామపక్షాలు ఉంటాయి: సురవరం
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కన్నీళ్లు, ఆకలి ఉన్నన్ని రోజులు వామపక్ష పార్టీలు ఉంటాయని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీపీఐ 96వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం మఖ్దూం భవన్‌లో జెండా ఎగరవేసి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత సీపీఐకే సుదీర్ఘ చరిత్ర ఉందని, దున్నేవాడిదే భూమి పోరాటం చేసింది సీపీఐ పార్టీనే అని తెలిపారు. పార్లమెంటరీ వ్యవస్థలో గెలుపు ఓటములు సహజమన్నారు. అదానీ, అంబానీ కోసమే ప్రధాని మోడీ కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Next Story