కమలాపూర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీపీ

by Shyam |
CP Tarun Joshi
X

దిశ ప్రతినిధి, వరంగల్: హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్ మండలంలో ఎన్నికలు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలను వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి పరిశీలించారు. ఈ సందర్బంగా పోలింగ్ జరుగుతున్న తీరును పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లతో పాటు కరోనా నేపథ్యంలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్ల కోసం ఆరోగ్య సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై వైద్య సిబ్బందితో ముచ్చటించారు. అనంతరం ఎన్నికలు మరింత సజావుగా జరిగేందుకు పోలీస్ కమిషనర్ సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, కాజీపేట, మామూనూర్ ఏసీపీలు శ్రీనివాస్, నరేష్ కుమార్‌కు పలు సూచనలు సలహాలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed