నిబంధనలు బ్రేక్ చేస్తే.. పాసులున్న వారినీ వదలొద్దు

by Sridhar Babu |
నిబంధనలు బ్రేక్ చేస్తే.. పాసులున్న వారినీ వదలొద్దు
X

దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ జారీ చేసిన పాసులు తీసుకుని రూల్స్ బ్రేక్ చేస్తున్న వారితోనూ కఠినంగా వ్యవహరించాలని అధికారులను రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశించారు. లాక్‌డౌన్ పొడగింపు తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీని నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. ఈ సంద్బంగా సీపీ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో పాసులు తీసుకున్న వారు కూడా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారని వివరించారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పోలీసులు మరింత కఠినంగా విధులు నిర్వర్తించాలన్నారు. పాసులు తీసుకున్న వారి గడువు ముగిసినా ఇంకా వాటితోనే తిరుగుతున్నారని, అలాంటి వారిని గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేయాలని, బ్లూ కోట్స్ పోలీసులు గల్లీ గల్లీలో పెట్రోలింగ్‌ను చేపట్టాలన్నారు. పాసుల గడువు తేదీ ముగిసినా, రెన్యూవల్ చేసుకోకుండా బయట తిరుగుతూ పట్టుబడితే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.

Tags: corona, lockdown,department passes, don’t leave them, cp satyanarayana



Next Story

Most Viewed