- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lockdown News : వీధుల్లో తిరిగితే కేసులు.. సీపీ వార్నింగ్
దిశ, కుత్బుల్లాపూర్: వీధుల్లో సంచరిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. బాలానగర్ జోన్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ చంద్రానగర్‌లో అయన ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. ప్రతి వీధిలో కాలినడకన డీసీపీ పద్మజ,ఇతర అధికారులతో కలిసి 30 నిమిషాలు పర్యటించి బయట తిరుగుతున్న వారితో మాట్లాడారు. అవసరమైతే తప్ప ఎందుకు తిరుగుతున్నారని హెచ్చరించారు. ప్రకటించిన సమయంలో కాకుండా ఇతర టైం లో బయటకు వస్తే జరిమానాతోనే సరిపెట్టుకోకుండా కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
ప్రతి వీధిలో నిత్యం గస్తీ నిర్వహించాలన్నారు. ప్రజలు కూడా లాక్ డౌన్ ఎందుకు పెట్టారో… అయినా కూడా ఎందుకు బయటకు వస్తున్నారో మీలో మీరే ఆలోచించుకోవాలన్నారు. నిబంధనలు పాటించి కరోనాకు గురికాకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ లు పురుషోత్తం, గంగారెడ్డి, సీఐ బాలరాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.