పోలీసులు క్రమశిక్షణ పాటించాలి

by Shyam |
పోలీసులు క్రమశిక్షణ పాటించాలి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: పోలీసులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. 2020 ఏఆర్ బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు ట్రైనింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీపీ మాట్లాడుతూ ప్రభుత్వం పోలీస్ శాఖకు అధిక ప్రాధానత్య ఇస్తున్నట్టు చెప్పారు. పోలీసులు నిరంతరం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేయాలని, పోలీసు వ్యవస్థకు ఏఆర్ సిబ్బంది వెన్నముక వంటిదన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ పోలీసులు వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. క్రీడలు నాయకత్వ లక్షణాలను, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. కార్యక్రమంలో సినీ నటుడు శివారెడ్డి పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్‌లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

Advertisement

Next Story