వాళ్లు తీవ్రవాదులతో సమానం: సజ్జనార్

by Sumithra |
వాళ్లు తీవ్రవాదులతో సమానం: సజ్జనార్
X

దిశ, క్రైమ్ బ్యూరో : మద్యం తాగి వాహనాలు నడిపే వారు ఉగ్రవాదుల కంటే తక్కువేం కాదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు ఏ సమయంలో ఎలాంటి నేరాలకు పాల్పడతారో తెలియనట్టే.. డ్రంకెన్ డ్రైవింగ్ చేసే వారు కూడా ఏ టైంలో ఏ ప్రమాదానికి కారకులవుతారో తెలియదన్నారు. ఈ సమయంలో పోలీసులు లేనప్పుడు రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనదారులు నిజమైన దేశభక్తులని అన్నారు.

నూతన సంవత్సర వేడుకలు డిసెంబరు 31, జనవరి 1లను పురస్కరించుకుని సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ… రోడ్లపై మద్యం తాగి వాహనం నడుపుతున్న వారి కారణంగా అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఇతరుల మరణాలకు కారణమయ్యే వారిపై క్రిమినల్ కేసులను బుక్ చేస్తున్నామని అన్నారు. చట్టంలోని 304 పార్ట్ II కింద హత్య కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తామని హెచ్చరించారు. ఈ సెక్షన్ ప్రకారం దోషులకు 10 ఏండ్లు జైలు శిక్ష పడుతుందన్నారు.

Advertisement

Next Story