కరోనా పాజిటివ్ పోలీసులతో సీపీ జూమ్ మీటింగ్

by  |
కరోనా పాజిటివ్ పోలీసులతో సీపీ జూమ్ మీటింగ్
X

దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనాను ఆత్మవిశ్వాసంతోనే జయించాలని, ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో కరోనా పాజిటివ్ వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో సీపీ మంగళవారం జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధుల్లో పోలీసులకు కరోనా పాజిటివ్ రావడం దురదృష్టకరమే అయినప్పటికీ, వైద్యుల సలహాలను తప్పకుండా పాటించాలన్నారు. ఈ ప్రభావం ఖచ్చితంగా కుటుంబ సభ్యులపై ఉంటున్నందున ఆత్మవిశ్వాసంతో ఉంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలన్నారు.

జూలై 4 నుంచి ఇప్పటి వరకూ కొవిడ్ పాజిటివ్ పోలీసులతో జూమ్ సమావేశం 7విడతలుగా నిర్వహించినట్టు చెప్పారు. రాచకొండ పరిధిలో దాదాపు 400 మంది పాజిటివ్ పోలీసులతో జూమ్ ద్వారా మాట్లాడినట్టు తెలిపారు. పాజిటివ్ వచ్చిన పోలీసుకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటామని భరోసా కల్పించారు. పాజిటివ్ కేసుల్లో 99.5శాతం మంది ఇంటి వద్ద నుంచే ఉపశమనం పొందారని, కొద్దిమందిని మాత్రమే ఆస్పత్రిలో చేర్పించామని అన్నారు.



Next Story

Most Viewed