నిత్యావసరాలు పంపిణీ చేసిన సీపీ

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌ సోర్సింగ్, జీఎంఆర్ సిబ్బందికి సీపీ మహేశ్‌ భగవత్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. శుక్రవారం ఎల్బీనగర్‌‌లో ఈ కార్యక్రమం జరిగిన అనంతరం ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని, ఈ సమయంలో ప్రజలెవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టామని చెప్పారు.

Tags: Rachakonda Commissionerate, CP Mahesh Bhagwat, Essential Distribution, Corona Virus, Lockdown

Advertisement

Next Story