- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సైబర్ నేరాల అడ్డుకట్టకు నిపుణులు ముందుకు రావాలి: సీపీ
దిశ, క్రైమ్ బ్యూరో: సైబర్ నేరాల నియంత్రణపై రెండ్రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న సైబర్ యోధాలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కింద సైబర్ క్రైమ్ వాలంటీర్‌గా నమోదు చేసుకోవాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నేరేడ్మెట్ కమిషనర్ కార్యాలయంలో రెండ్రోజుల సైబర్ యోధాల శిక్షణ ఆదివారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హజరైన సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ శిక్షణ పొందిన వారి నైపుణ్యం, ఆసక్తిని బట్టి వాలంటీర్లు కంటెంట్ ఫ్లాగర్, సైబర్ అవేర్ నెస్ ప్రమోటర్ లేదా సైబర్ నిపుణులు అవడానికి అవకాశం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడంతో నేరస్థులు వైవిధ్యభరితమైన సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు యువ నిపుణులు ముందుకు రావాలని కోరారు. అశ్లీలత, లాటరీ మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, ఉద్యోగ మోసాలు, ఆన్‌లైన్ స్టాకింగ్, టెలిఫోనిక్ మోసం తదితర పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలకు బలి కాకుండా ఉండటానికి, సాధారణ పౌరులకు అవగాహన కల్పించడంలో సైబర్ యోధాలు చురుకైన పాత్ర పోషించాలని అన్నారు.