- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకస్మిక తనిఖీలు నిర్వహించండి: రాచకొండ సీపీ
దిశ, ఎల్బీనగర్: డ్రగ్స్ పై పటిష్ట నిఘా ఉంచాలని, ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహించాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. గురువారం ఎల్బీనగర్ లోని కుశాల్ ఫంక్షన్ హాల్‌లో నార్కోటిక్ డ్రైగ్స్‌పై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌లో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్ఓలు, ఎసీఎస్‌పి, ఎల్ అండ్ ఓ, డీసీఎస్‌పి, ఎస్ఓటి పోలీస్ అధికారులు పాల్గొన్నారు. డీఆర్ఐ (డైరెక్టరెట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) సూపరింటెండెంట్ ఎ. రంగనాధం, ఎల్బీనగర్ కోర్టు అడిషన్ పీపీ కే. రాజిరెడ్డిలు ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన కల్పించారు.
రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ఎన్డీపీఎస్ చట్టంలోని వివిధ సెక్షన్లపై పోలీసుకు అవగాహన ఉండాలన్నారు. చట్టంలోని నిబంధనలను ఉపయోగించుకోవాలని, ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగదారులు, రవాణాదారుల పై నిఘా ఉంచాలన్నారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఎస్‌హెచ్ఓలను సీపీ కోరారు.
2021లో ఇప్పటి వరకు 86 కేసుల్లో 5,500 కేజీల గంజాయి, 7 లీటర్ల హషీష్ ఆయిల్, 400 కేజీల నల్లమందు స్వాధీనం చేసుకున్నామని, 31 మంది డ్రగ్స్ ట్రాఫికర్లను అదుపులోకి తీసుకున్నామని సీపీ తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టంపై రాచకొండ ఏసీపీలు, ఎస్‌హెచ్ఓలు, ఐఓలు, స్టేషన్ రైటర్‌లకు తన విలువైన మార్గ నిర్ధేశం చేసిన పరిశోధకులు డీఆర్ఐ రంగనాధంను సీపీ మహేష్ భగవత్ అభినందించారు.