- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెల్లవారుజామున అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు తనిఖీ
దిశ, నిజామాబాద్: కరోనా నియంత్రణకు జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ను పోలీస్ కమిషనర్ కార్తికేయ పకడ్బందీగా అమలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా బోధన్ రూరల్ పరిధిలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సాలూర్ చెక్‌పోస్ట్(ఉమ్మడి చెక్‌పోస్ట్)ను బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ అందజేశారు. వారికి కల్పించిన సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహరాష్ట్రలో కరోనా మహమ్మారి కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే వాహనాలను, వ్యక్తులను అనుమతించొద్దని సూచించారు. కేవలం అత్యవసర సరుకులు, అది కూడా అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు.
Tags: CP Karthikeya, checked, interstate, check post, morning, corona, mh