ఉప పోరుకు పటిష్ట బందోబస్తు

by Shyam |
ఉప పోరుకు పటిష్ట బందోబస్తు
X

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు రెండు వేల మందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా రూట్ మొబైల్ అధికారులకు, సిబ్బందికి సోమవారం దుబ్బాక, లచ్చపేట డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….దుబ్బాక ఉప ఎన్నికలకు ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రెస్టేజ్‌గా తీసుకొని ప్రచారం చేశారని తెలిపారు. ఈ ఎన్నికలను నలుగురు అబ్జర్వర్లు మానిటర్ చేస్తున్నారని తెలిపారు. పోలీసుల పనితీరు గురించి పోలీస్ అబ్జర్వర్ మానిటర్ చేస్తారని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాహనాలపై వచ్చేవారు పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల బయటనే వాహనాలు పార్క్ చేసుకొని వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 15 సమస్యాత్మక గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి ప్రత్యేకంగా 63 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించి విధులను నిర్వహించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed