ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికే సస్పెన్షన్?

by Sumithra |   ( Updated:2021-06-29 12:36:13.0  )
Chinnakodur Police Station
X

దిశ ప్రతినిధి, మెదక్ : అవినీతి అక్రమాలకు సిద్దిపేట జిల్లా నిలయంగా మారింది. అవినీతిలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో నిలవగా… పోలీస్ శాఖ రెండో స్థానంలో నిలుస్తోంది. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆవిర్భవించిన నాటి నుండి అవినీతి పేరుకుపోయిందనే ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. తాజాగా సిద్దిపేట నియోజకవర్గంలోని ఓ ఎస్ఐ ఇసుక మాఫియాతో కుమ్మక్కై లంచాలు తీసుకుంటున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీపీ విచారణ జరిపి ఆ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేసినట్టు సమాచారం. అయితే ఇంకా అధికారికంగా సస్పెన్షన్ ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు.

ఆర్థిక లావాదేవీల ఆరోపణలతో సస్పెన్షన్..

సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా సాయికుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రొహిబిషన్ పీరియడ్ పూర్తి చేసుకుని చిన్నకోడూర్ ఎస్ఐగా ఏడాది క్రితమే బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇటీవల అక్రమంగా ఇసుక తరలించే వారితో కుమ్మక్కైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారితో ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడం ఆరోపణల విషయం బహిర్గతమైనది. విచారణ చేపట్టిన సీపీ జోయల్ డేవిస్.. ఆ ఎస్ఐని సస్పెండ్ చేసినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed