సీపీ గెట్ పరీక్ష వాయిదా

by Shyam |
సీపీ గెట్ పరీక్ష వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 8న నిర్వహించాల్సిన కామన్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఎంట్రన్స్ టెస్ట్‌ (సీపీజీఈటీ)ను వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ కిషన్ ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని, అప్‌డేట్ కోసం విద్యార్థులు వెబ్ సైట్‌లో చూడాలని సూచించారు. ఓయూ పరిధిలో మంగళవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ శ్రీరాం వెంకటేష్ తెలిపారు. తొమ్మిదో తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఒకేషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ ఒకేషనల్ కోర్సుల బ్యాక్‌లాగ్ సబ్జెక్టులకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 19 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల పరీక్షలను నిర్వహించనున్నారు. థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఫస్టియర్ విద్యార్థులకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి నాలుగు గంటల వరకూ పరీక్ష ఉంటుంది. సెకండియర్ విద్యార్థులకు తదుపరి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story