- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సుచిత్ర చెక్‌పోస్ట్(మొబైల్ ఇల్లు) పై సీపీ కితాబు
by Shyam |

X
దిశ, కుత్బుల్లాపూర్ : లాక్‌డౌన్ కారణంగా 44వ నెంబర్ జాతీయ రహదారి సుచిత్ర చౌరస్తాలో పేట్‌బషీరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు(మొబైల్ ఇల్లు) బాగుందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కితాబిచ్చారు. దూలపల్లికి చెందిన మొబైల్ ఇండ్ల తయారీదారుడు టెంట్ ఏర్పాటు చేయడం వల్ల గాలికి కూలుతుందని, ప్రమాదం జరిగే అవకాశముందని గ్రహించి తయారు చేసిన ఇల్లును చెక్ పోస్టుగా ఏర్పాటు చేశాడు. అయితే గురువారం ఆకస్మీక సందర్శనకు వచ్చిన సీపీ ఆ ఇల్లును చూసి ఆశ్చర్యపోయాడు. ఇల్లు బాగుందని కాసేపు అందులో కూర్చుని ఎండ నుంచి ఉపశమనం పొందాడు. డీసీపీ పద్మజ, ఏసీపీ వీవీఎస్ రామలింగరాజు, సీఐ రమేష్, డీఐ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Next Story