1300 గంటలు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారు: సీపీ

by Anukaran |   ( Updated:2021-01-11 06:06:24.0  )
1300 గంటలు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారు: సీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: బోయినపల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్ కేసులో మల్లికార్జున‌రెడ్డి, సంపత్‌కుమార్, అఖిలప్రియ పీఏ బాలచెన్నయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈకేసులో ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్‌ అయి రిమాండ్‌లో ఉండగా నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లు, నకిలీ నంబర్‌ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ కోసం మియాపూర్‌లో సెల్‌ఫోన్లు, ఆరు సిమ్‌కార్డులు తీసుకున్న నిందితులు, బాధితుల ఇంటిని దాదాపు 1300గంటల పాటు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారని సీపీ అంజనీకుమార్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో 143కాల్స్‌ను ట్రేస్ చేశామని.. అఖిలప్రియ నెంబర్‌ నుంచి గుంటూరు శ్రీనుకు ఫోన్‌కాల్స్ వెళ్లాయని, కిడ్నాప్ కోసం అఖిలప్రియ 70956 37583 నెంబర్ వాడారని సీపీ తెలిపారు. ఈ కిడ్నాప్ కేసులో భార్గవ్ రామ్ పాత్ర ఉందని.. భార్గవ్ రామ్ స్కూల్‌ ‌లోనే కిడ్నాప్ స్కెచ్ వేశారని పేర్కొన్నారు.

జనవరి 5న అఖిలప్రియ ఫోన్ ద్వారా కిడ్నాప్ ప్రక్రియ సాగిందని, గుంటూరు శ్రీను వాడిన సిమ్ ద్వారా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు టవర్ లొకేషన్ల ట్రేసింగ్ చేశామని సీపీ తెలిపారు. అఖిలప్రియ అరెస్ట్ సమయంలో మహిళా సీఐ ఉన్నారని, డీసీపీ నార్త్ జోన్ కమలేశ్ కి కిడ్నాపర్ నుంచి కాల్ వచ్చిందని, నిందితులు ఇన్నోవా, స్కార్ఫియో, స్విప్ట్, మహింద్రా ఇంకా కొన్ని బైక్‌లు ఉపయోగించారని, కూకట్‌పల్లి లోదా నుంచి యూసఫ్‌గూడకు వచ్చి కారు నెంబర్ ప్లేట్లు మార్చారని సీపీ వెల్లడించారు.

Advertisement

Next Story