ఫ్రంట్ లైన్ వారియర్లకు సీపీ నివాళులు

by Sumithra |
ఫ్రంట్ లైన్ వారియర్లకు సీపీ నివాళులు
X

దిశ, క్రైమ్ బ్యూరో : నగరంలో కోవిడ్ -19 నివారణలో విధులు చేపట్టి..కరోనా బారినపడి మృతి చెందిన నగర పోలీసులకు సీపీ అంజనీకుమార్ శుక్రవారం గౌరవ వందనం చేశారు. వారి కుటుంబ సభ్యులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం సీపీ అంజనీకుమార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారి సేవలకు గుర్తుగా ప్రశంసా పత్రాలను వారి కుుటంబ సభ్యులకు అందజేశారు. నగర కమిషనరేట్ పరిధిలో కరోనాతో మరణించిన 34 మంది పోలీసు అధికారులకు ఘనంగా నివాళులర్పించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా ముందుండి వారు అందించిన సేవలను కొనియాడారు.

Advertisement

Next Story