రేపు ఉ.11గంటలకు ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర

by Shyam |
రేపు ఉ.11గంటలకు ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అంజనీకుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు. 15వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని.. ప్రధాన కూడళ్ల వద్ద డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలను కొన్ని నాళాల మరమ్మతుల కారణంగా దారి మళ్లిస్తున్నామని, ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న 50వేల సీసీ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తామని సీపీ చెప్పారు. ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలన్నారు.

అటు వినాయక చవితి అనగానే గుర్తొచ్చే ఖైరతాబాద్ మహా గణపతి ఊరేగింపు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పోలీసుల బందోబస్తు నడుమ ఈ శోభాయాత్ర సాగనుంది. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయాలని ఉత్సవ సమితి సభ్యులు భావించినప్పటికీ.. భక్తుల కోరికతో పాటు పోలీసుల నుంచి అనుమతి లభించడంతో యథాతథంగా ఊరేగింపు కొనసాగి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.

Advertisement

Next Story