- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కరోనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం సికింద్రాబాద్‌లో కరోన బారిన పడి, కోలుకున్న నార్త్ జోన్ పోలీసులను సీపీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే మొదటిసారి పోలీసులు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
అంతేగాకుండా అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పోలీసులు సేవలు అందించారని తెలిపారు. నక్సలైట్లు, రౌడీ షీటర్ల లాంటి విద్రోహ శక్తులతో పోరాటం చేశారని, కానీ, నేడు కనపడని శత్రువు కరోనాతో పోరాటం చేసి ప్రజల ప్రాణాలను కాపాడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విధి నిర్వాహణలో కూడా నగర పోలీసులు చాలా సాహసోపేతంగా పని చేస్తున్నారన్నారు. ముఖ్యంగా నార్త్ జోన్ పోలీసులను సీపీ అభినందించారు.
Advertisement
Next Story