- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పిడుగుపడి ఆవు మృతి

X
దిశ,సిద్దిపేట : పిడుగు పడి ఆవు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాచాపూర్ గ్రామానికి చెందిన దుర్గి ముత్తయ్య అనే రైతు తన పాడి ఆవును వ్యవసాయ పొలం వద్ద కట్టేసాడు. శనివారం ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు అధికమై ఆవు ఉన్న ప్రాంతంలో పిడుగు పడింది. ముత్తయ్య బావి వద్దకు వెళ్లి చూసేసరికి ఆవు మృతి చెందింది. తమకు జీవనాధారంగా ఉన్న సుమారు 90 వేల రూపాయల విలువ గల ఆవు చనిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
Next Story