అలాంటి వారు 'కొవిషీల్డ్' తీసుకోవద్దు : సీరం ఇన్‌స్టిట్యూట్

by Shamantha N |
అలాంటి వారు కొవిషీల్డ్ తీసుకోవద్దు : సీరం ఇన్‌స్టిట్యూట్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ను తీవ్రమైన అలర్జీ ఉన్నవారు తీసుకోకూడదని సీరం ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఇటీవల కరోనా వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. ‘ఎవరైన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను తీసుకున్న తర్వాత తీవ్రమైన అలర్జీని ఎదుర్కొంటే గనక అలాంటి వారు వ్యాక్సిన్‌ను తీసుకోవద్దు.

ఈ వ్యాక్సిన్‌ను పొందాలనుకునే వారు ఇదివరకు ఏదైనా మెడిసిన్, ఫుడ్, మరేదైనా సాధారణ వ్యాక్సిన్‌ను తీసుకున్న సమయంలో అలర్జీకి గురయ్యారా లేదా అనే అంశాలను ఖచ్చితంగా వైద్యులకు తెలియజేయాలి. అలాగే, జ్వరం ఉన్నవారు, రక్తస్రావం ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి కోసం మందులను వినియోగిస్తున్నవారు ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను తీసుకోకూడదు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలని’ సూచించింది.

Advertisement

Next Story

Most Viewed