కొవిడ్ 19 చెత్తతో కొత్త సమస్య… లేబులింగ్ తప్పనిసరి!

by sudharani |
కొవిడ్ 19 చెత్తతో కొత్త సమస్య… లేబులింగ్ తప్పనిసరి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ రకంగా చూసినా కొవిడ్ 19 అన్ని వైపుల నుంచి సమస్యలు సృష్టిస్తోనే ఉంది. వైరస్ వ్యాప్తి తర్వాత వ్యాధి ప్రబలడం ఒక సమస్య, వ్యాప్తి తగ్గించడానికి లాక్‌డౌన్ చేయడం వల్ల ఆర్థిక, సామాజిక సమస్యలు, ఇక కొవిడ్ 19 చెత్త వల్ల కూడా కొత్త సమస్య రానుంది.

వైరస్ ఉందని అనుమానం వచ్చిన వారందరినీ వెంటనే క్వారంటైన్ చేసి పరీక్షలు, ట్రీట్‌మెంటులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలు, ట్రీట్‌మెంట్లలో ఉపయోగించిన ఆసుపత్రి వస్తువులు, నాళికలు, దూది, సూదులు, వస్త్రాలు ఇలా అన్నింటిని క్వారంటైన్ చేసి శానిటైజ్ చేయడం కష్టమే. అలా కాకుండా విచ్చలవిడిగా బయటపడేస్తే ఆ వైరస్ ఈ వస్తువుల్లో బతికి ఉండి, మళ్లీ విజృంభించే అవకాశం ఉంది. అందుకే ఈ కొవిడ్ 19 చెత్త ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ మేరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) వారు ఒక ప్రకటన చేసింది. వైరస్ ట్రీట్‌మెంటులో ఉత్పత్తైన బయోమెడికల్ వేస్టుకి కొవిడ్ 19 వేస్ట్ అని లేబులింగ్ చేయాలని పేర్కొంది. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ 2016 నిబంధనల ప్రకారం ఈ సూచనలు జారీ చేసింది. హెల్త్ ఇన్ఫాస్ట్రక్చర్లో అత్యవసర విధిగా కేంద్రం దీన్ని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొవిడ్ ట్రీట్‌మెంట్, పరీక్ష పూర్తయిన వెంటనే వస్తువులు డిస్పోస్ చేయాలని ఆదేశించింది. కొవిడ్ 19 బయోమెడికల్ వేస్టుని డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ గా పరిగణించాలని పేర్కొంది. అలాగే ఈ కొవిడ్ 19 బయోమెడికల్ వేస్ట్ సేకరించడానికి ప్రత్యేకమైన ట్రాలీలు వాడటంతో పాటు, సిబ్బంది అత్యున్నత ప్రమాణాలతో కూడిన మాస్కులు, రక్షణ పరికరాలు ఉపయోగించాలని సూచించింది. అలాగే ప్రతిసారి హైపోక్లోరేట్ ద్రావణం పిచికారీ చేసి కొవిడ్ 19 వేస్టు సేకరించాలని తెలియజేసింది.

Tags: COVID 19, Corona, Bio waste, labelling

Advertisement

Next Story

Most Viewed