కరోనా మైనర్ బాలికపై కోవిడ్ పేషెంట్ అత్యాచారం

by  |   ( Updated:2020-07-24 00:02:28.0  )
కరోనా మైనర్ బాలికపై కోవిడ్ పేషెంట్ అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: కొందరు కామపిశాచులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అవమానీయ ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా కష్ట కాలంలో వారి వ్యవహారం గమనిస్తే.. మరీ ఇంత దారుణమా అని ఆగ్రహం వ్యక్తం చేయక మానదు. కరోనా సోకి క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కోవిడ్ సెంటర్ లో 14 ఏళ్ల మైనర్ బాలిక కరోనా సోకి చికిత్స పొందుతున్నది. అయితే అక్కడే కరోనా చికిత్స పొందుతున్న మరో వ్యక్తి ఆమెపై దారుణం ఒడిగట్టాడు. బాత్రూమ్ వద్ద ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాన్ని మరో కరోనా పేషెంట్ తన ఫోన్లో చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలిని మరో ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed