వీటికి మాత్రమే అనుమతులు!

by Shamantha N |
వీటికి మాత్రమే అనుమతులు!
X

కొవిడ్-19 కారణంగా లాక్‌డౌన్ పొడిగించిన తర్వాత ఏప్రిల్ 20 నుంచి పరిమితంగా సడలింపు ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు హోమ్ శాఖ సోమవారం నుంచి సడలింపు గురించి మార్గదర్శకాలను జారీ చేసింది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు నమోదు కాని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను సడలించనున్నట్టు ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సడలింపు అమలైన ప్రాంతాల్లో ఏవైనా కొత్త కేసులు నమోదైతే వెంటనే ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ అమలవుతుందని కేంద్రం చెబుతోంది. అలాగే, ఏప్రిల్ 20 నుంచి సడలించిన వాటి గురించి హెల్త్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. అవేంటో తెలుసుకుందాం..!

1. ప్రైవేట్ వాహనాలకు సంబంధించి, కారులో ఇద్దరికీ మించకుండా ప్రయాణించాలి. ద్విచక్ర వాహనాలపై ఒక్కరికి మించి అనుమతి ఉండదు. అది కూడా అత్యవసర, అరుదైన పరిస్థితులలో మాత్రమే వీటికి అనుమతి ఉంటుంది.

2. కోవిడ్ -19 యొక్క కమ్యూనిటీ వ్యాప్తిని ఆపడానికి ప్రైవేట్ టాక్సీలు, క్యాబ్‌లు, ఆటో రిక్షాలు అనుమతించబడవు. క్యాబ్‌లు, టాక్సీలలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటికి అనుమతిలేదు. అయితే, బైకులు, స్కూటర్, కార్‌ల రిపేర్ చేయించుకోవడానికి వీలుగా సోమవారం నుంచి మెకానిక్స్ అందుబాటులో ఉంటారు.

3. ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా పునరుద్ధరించడానికి, ప్రభుత్వం సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు తీసుకురావడానికి అనుమతించింది. ఐటీ కంపెనీలు తమ శ్రామికశక్తిలో గరిష్టంగా 50 శాతం ఉద్యోగులకు అనుమతి ఉంటుంది. ఇతర పరిశ్రమలు తమ శ్రామిక శక్తిలో 33 శాతం మాత్రమే అనుమతి ఉంటుంది. ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు ఉద్యోగుల మధ్య 10 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సంస్థలదే అని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అలాగే ఉద్యోగులకు ఫేస్ మాస్క్‌లు కూడా తప్పనిసరిగా ఉండాలి.

4. 65 ఏళ్లు పైబడిన వారిని, ఐదేళ్ల లోపు పిల్లలను కంపెనీ యజమానులు తమ ఆఫీసులకు తీసుకెళ్లకూడదు.

5. ఇ-కామర్స్ సేవల్లో అవసరమైన ఉత్పత్తులు మాత్రమే అనుమతించబడతాయి, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ కిరణా దుకాణాలు కూడా తెరిచి ఉండేందుకు అనుమతి ఇచ్చింది.

6. దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పన రంగాలలో ఒకటి.. నిర్మాణ రంగం. సోమవారం నుండి పనిచేయడానికి ఈ రంగంలోని వారికి అనుమతి ఇచ్చారు. అయితే, ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి కార్మికులను తీసుకురావడానికి కాంట్రాక్టర్లకు అనుమతి లేదు.

7. ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, మెకానిక్‌లకు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పరిమితుల నుండి మినహాయించారు. కొరియర్ సేవలు, డిటిహెచ్ ఆపరేటర్లు, ఎలక్ట్రిక్ ఉపకరణాల మరమ్మత్తులు కూడా రేపటి నుంచి అనుమతించబడతాయి.

8. కార్గో రైళ్లు, విమానాలలో అవసరమైన వస్తువుల రవాణా నిరంతరాయంగా కొనసాగుతుందని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

9. ఏటీఎంలు, ఆస్పత్రులు, బ్యాంకులు, పెట్రోల్ పంపులు, సీఎన్‌జీ స్టేషన్‌లు, ఫార్మసీ షాపులు, ఇతర సేవలతో సహా అన్ని అత్యవసర సేవలు సజావుగా పనిచేస్తాయి.

Tags: lockdown relaxation, COVID-19,activities allowed, MHA, PM, narendra modi, limited restrictions


Advertisement
Next Story

Most Viewed