ఆర్గానిక్ పద్ధతులపై ప్రచారంలో ‘కోవే’

by Shyam |
ఆర్గానిక్ పద్ధతులపై ప్రచారంలో ‘కోవే’
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్గానిక్ పద్ధతులపై కాన్ఫిడరేషన్ ఆఫ్ విమెన్ ఎంట్రపెన్యూర్స్(కోవే) సంస్థ ప్రచారం చేస్తోంది. పారిశ్రామిక వాడల్లో ఈడీపీ, ఎన్‌ఎస్ఐసీ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో బుధవారం కోవే జాతీయ అధ్యక్షురాలు నీరజారెడ్డి అధ్యక్షతన పలుచోట్ల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్‌ఎస్ఐసీ వంటి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. కోవే సంఘటిత నిధి ద్వారా కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటూ, ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నట్లు కోవే ప్రతినిధులు తెలిపారు. ప్రధాని మోడీ “ఓకల్ ఫర్ లోకల్” పిలుపు మేరకు కోవే కీర్తి చెకోటి, చెకోటి ఫార్మ్స్, అరుణదార, అప్నా గ్రీన్ సంస్థలతో కలిసి సంఘటిత నిధి కార్యక్రమాన్ని చేపట్టారు. చెకోటి ఫార్మ్స్ ఆధ్వర్యంలో రైతులను సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల దిశగా ప్రోత్సహించేందుకు అవగాహన కల్పించారు.

Advertisement

Next Story

Most Viewed