- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిమ్స్‌లో ‘కోవాక్సిన్’ ట్రయల్స్ షురూ
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ‘కోవాక్సిన్’ హ్యూమన్ ట్రయల్స్ ఢిల్లీలోని ఆల్ ఇండియ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్) ప్రారంభమయ్యాయి. 30 ఏళ్ల పార్టిసిపెంట్‌కు ఈ టీకాను ఎయిమ్స్ ప్రయోగించింది. 0.5 మిల్లి లీటర్ల డోస్‌ను అతనికి అందించారని, కనీసం రెండు గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు ఎయిమ్స్‌లో వ్యాక్సిన్ ట్రయల్ ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. క్షుణ్ణంగా పరిశీలించడానికి అతనికి ఒక డైరీ ఇచ్చి మార్పులను నోట్ చేయాల్సిందిగా సూచించినట్టు వివరించారు.
అలాగే, ఒక వారంపాటు అతన్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉంటామని, మెడికల్‌పరంగా మార్పుల గురించి పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈ ట్రయల్స్‌లో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకున్నవారిలో పలుపరీక్షలు నిర్వహించిన 20 మంది జాబితాను రూపొందించారని, ఆ టెస్టుల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా ఈ కోవాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతుల తర్వాత హ్యూమన్ ట్రయల్స్ కోసం దేశవ్యాప్తంగా 12 సంస్థలను ఎంచుకున్నారు. తొలి దశలో 375మందిపై ట్రయల్స్ నిర్వహించనుండగా ఇందులో 100 మందిపై ఎయిమ్స్‌లోనే ట్రయల్స్ జరగనున్నాయి. రెండో దశలో 750 మందిపై ట్రయల్స్ నిర్వహించనున్నారు.