- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆశాజనకంగా కోవాక్సిన్ ట్రయల్స్

X
రోహతక్: దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ ఫేజ్-1లోని తొలి భాగం ట్రయల్స్ శనివారానికి పూర్తయ్యాయి. ఈ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. అలాగే, రెండో భాగం ట్రయల్స్ కోసం శనివారమే ఆరుగురికి ఈ టీకా అందించారు. ఫేజ్-1 తొలి భాగం కోవాక్సిన్ ట్రయల్స్ పూర్తయ్యాయని రోహతక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ సవితా వర్మ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 50 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చిన ట్రయల్ ఫలితాలు వచ్చాయని, తొలి భాగం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. ఫేజ్-1 రెండో భాగం కోసం ఆరుగురికి అందించారని వివరించారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story