కోర్టుకు వెళ్ళాక న్యాయం

by  |
కోర్టుకు వెళ్ళాక న్యాయం
X

దిశ, న్యూస్ బ్యూరో:
గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో ప్రభుత్వం ఇటీవల జరిపిన రిక్రూట్‌మెంట్ విధానంతో అన్యాయం జరుగుతోందని కోర్టును ఆశ్రయించిన ఆరుగురు అభ్యర్థులకు న్యాయం లభించింది. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో బీఎస్సీ నర్సింగ్ చేసిన గ్రాడ్యుయేట్లకు, జీఎన్ఎం కోర్సు పూర్తిచేసిన డిప్లొమా అభ్యర్థులను ఒకే గాటన కట్టడాన్ని ఆరుగురు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టులో సవాలు చేశారు. డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు వేర్వేరు ప్రమాణాలు లేకపోవడంతో డిప్లొమా అభ్యర్థులకు ఎక్కువ పోస్టులు లభిస్తున్నాయన్నారు. దీంతో గ్రాడ్యుయేట్లకు అన్యాయం జరుగుతోందని కోర్టుకు వివరించారు. చాలా మంది బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు పోస్టింగ్ దక్కలేదని పేర్కొన్నారు. సుమారు 650 పోస్టుల కోసం పన్నెండువేలమంది దరఖాస్తు చేసుకున్నారనీ, అర్హతలు ఉన్నప్పటికీ గ్రాడ్యుయేట్లకు అవకాశం దక్కలేదన్నారు. ఇందుకు ప్రభుత్వం అనుసరించిన విధానమే కారణమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నవీన్ రావు బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్ దాఖలు చేసిన ఆరుగురు బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు పోస్టింగ్ ఇవ్వడాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది.



Next Story

Most Viewed