కరోనా నుంచి కోలుకున్న దంపతులు సూసైడ్

దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకిన ఆ దంపతులు అత్మస్థైర్యంతో జయించారు. కానీ, ఏమైందో తెలియదు వారు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని ధర్మవరంలో ఫణిరాజు, శిరీష అనే వీరిద్దరూ భార్యాభర్తలు. అయితే వీరికి ఇటీవలే కరోనా సోకింది.

దీంతో వారు చికిత్స తీసుకున్నారు. అనంతరం వీరికి నెగెటివ్ వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత వారు ఇంటికి చేరుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ, వారు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. చుట్టుప్రక్కలవారు అంటరానివారిలా చూస్తున్నారనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement