దుబాయ్‌లో ఇండియన్ దంపతుల హత్య

దిశ, వెబ్ డెస్క్:
దుబాయ్‌లో భారతీయ దంపతులు దారుణంగా హత్యకు గురయ్యారు. దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడు విచక్షణ రహితంగా వారిని హత్య చేసి ఇంట్లోని డబ్బు, నగలను దోచుకెళ్లాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ నిందితుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మృతులు హిరెన్ అధియా, విధి అధియాగా గుర్తించారు.

Advertisement