- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ పుట్టిన దేశం చైనా అని అందరికీ తెలిసిందే. ఇక తాజాగా చైనా వ్యాక్సిన్లను కూడా వదిలి పెట్టడం లేదు. చాలా దేశాలు హడావుడిగా చైనా వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసి తమ ప్రజలకు వేసేశాయి. ఇప్పుడా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆ వ్యాక్సిన్లు పని చేయకపోవడం వల్లేనని తెలిసింది.
అయితే చైనాలో లక్షల మంది ప్రయోగ దశలోనే ఉన్న కరోనా టీకాలను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ‘అత్యవసర వినియోగం’ పేరుతో ఇబ్బడిముబ్బడిగా వ్యాక్సిన్లు ఇచ్చేస్తున్నారు. టీకాల భద్రత, సమర్థతను నిర్ధారించే ప్రయోగాలు ప్రారంభం కాకముందే ఉద్యోగులు, పరిశోధకులకు టీకాలు ఇవ్వడం ద్వారా చైనా కంపెనీలు కలకలం సృష్టించాయి.
60 ఏళ్లు పైబడిన వారిపై చైనా వ్యాక్సిన్ సినోఫార్మ్ సమర్థవంతంగా పని చేయడం లేదని డ్రాగన్ కంట్రీకి అత్యంత మిత్ర దేశం పాకిస్తాన్ వెల్లడించింది. వ్యాక్సిన్లు వేసుకున్న వారికి మళ్లీ.. కరోనా సోకడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాసిరకం వ్యాక్సిన్లు ఇవ్వడం వల్లే మళ్లీ కరోనా విజృంభిస్తోందని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సరిగ్గా పని చేయడం లేదని ఆయా దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.