- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాలి ద్వారా కరోనా సోకుతున్నది
న్యూఢిల్లీ: గాలిలో తేలియాడుతున్న సూక్ష్మ కణాల్లోని కరోనా మహమ్మారి మనుషులకు సోకుతున్నదని వందల మంది శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అందుకు తగిన ఆధారాలున్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వైరస్ సంబంధిత నిబంధనలు మార్చాలని అభ్యర్థించారు. కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు లేదా ఇతర విధానాల్లో డ్రాప్‌లెట్స్(బింధువులు) రూపంలో సోకుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కాగా, సూక్ష్మ కణాల ద్వారా కూడా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతున్నదని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు బహిరంగ లేఖలో డబ్ల్యూహెచ్‌వోకు నివేదించారు. తుమ్మినప్పుడు లేదా చీదినప్పుడు(స్నీజ్) బింధువులు లేదా సూక్ష్మ కణాల మహమ్మారి వ్యాపించే అవకాశమున్నదని వివరించారు. ఈ సూక్ష్మ కణాలు ఒక గది వైశాల్యం మేరకు గాలిలో తేలియాడవచ్చునని, వీటి ద్వారా కూడా వైరస్ సోకే ప్రమాదమున్నదని తెలిపినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. కాగా, శాస్త్రజ్ఞుల ఆధారాలు ఆమోదయోగ్యంగా లేవని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది.