- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమానయాన రంగం గతేంటి?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మనుషుల్నే కాకుండా విమానాలను కూడా కదలకుండా కూర్చోబెట్టింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా ధాటికి విలవిల్లాడుతుంటే, తాజాగా వివిధ దేశాలను కలిపే విమానయాన రంగం కూడా నష్టాలు, కష్టాల ఊబిలో ఇరుక్కుంటున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు యూరప్‌లోని ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లైబీ దివాళా తీయగా, మరో రెండు మూడు నెలల్లో మరిన్ని సంస్థలకు ఇలాంటి దుస్థితే రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలోని చాలా విమానాయాన సంస్థలు 2020, మే నెల నాటికి దివాళా తీస్తాయని, ప్రభుత్వ, పరిశ్రమల వర్గాలు సంయుక్తంగా విమానయాన రంగాన్ని కాపాడగలవని, దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని గ్లోబల్ ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ ‘కాపా’ నివేదిక ఇచ్చింది.
అంతర్జాతీయంగా నెలకొన్న విపత్తును నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని లేదంటే ఈ ఏడాది మే నాటికి అనేక విమానయాన సంస్థలు దివాలా తీయడం ఖాయమని సెంటర్ ఫర్ ఏవియేషన్ నివేదికలో పేర్కొంది. ప్రాణాంతకమైన కరోనావైరస్ వ్యాప్తిని నివారించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రయాణ, వీసా ఆంక్షలు విధించాయి. దీంతో రెండు వారాల నుంచి విమాన ప్రయాణాలకు డిమాండ్ బాగా క్షీణించింది. రద్దు చేసిన వాటి కంటే ఫార్వర్డ్ బుకింగ్‌లు అధికంగా ఉన్నాయని, దీంతో నగదు నిల్వలు కూడా కరిగిపోతున్నాయని ‘కాపా’ పేర్కొంది.
అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు గత ఏడాదితో పోలిస్తే 2020 మార్చి మొదటి వారంలో కోటి మందికి పైగా ప్రయాణీకుల సంఖ్య తగ్గింది. ఈ పరిణామాలు విమానాయాన సంస్థలకు ఆందోళన కలిగించే విషయం. ఇదే పరిస్థితి కొనసాగితే ఏప్రిల్, మే నెలల్లో ప్రయాణీకుల సామర్థ్యాన్ని 50 శాతానికి కోల్పోవలసి ఉంటుంది.
కరోనా వ్యాప్తి కారణంగా రానున్న కొద్ది నెలల్లో మరిన్ని విమానయాన సంస్థలు దివాళా తీసే పరిస్థితి ఉంది. అంతర్జాతీయంగా ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోతూండటంతో విమాన సంస్థలకు కనీసం 12,000 కోట్ల డాలర్ల వరకూ నష్టం వాటిల్లె అవకాశముందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోషియేషన్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఇలాగే కొనసాగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న విమానయాన సంస్థలు దివాళా తీయడమే కాకుండా, మిగిలిన సంస్థలు కూడా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదముందని ఎయిర్‌లైన్ అనలిస్టులు చెబుతున్నారు. అనేక విమానాయాన సంస్థల ఆర్థిక పరిస్థితి సైతం కొంత బలహీనంగా ఉందని.. ప్రధానంగా చైనా, థాయ్‌లాండ్, నార్వే, హాంకాంగ్, దక్షిణ కొరియా, మెక్సికో దేశాలకు చెందిన సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితులు విమానయాన రంగానికి చాలా క్లిష్టమైన సందర్భమని, ప్రధానంగా నగదు నిల్వలు పెంచుకోవాల్సి ఉందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. నగదు నిల్వలు తక్కువ ఉన్న, అలాగే ధరల పోటీల్లో తలమునకలైన సంస్థలకు ఇది మరింత కష్టకాలమని అంటున్నారు. ఇక ఆసియాలోని ప్రాంతీయ విమానయాన సంస్థలు అధికంగా చైనా ప్రయాణికులపై ఆధారపడ్డాయని, ఆయా సంస్థలకు ఇది గడ్డుకాలమని విమానయాన రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే చాలా విమానాలు ఖాళీగా ఉన్నందున, ఖర్చులు తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కొందరు ఉద్యోగులను జీతం లేని సెలవులు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాయి. మరికొంతమందిని జీతాలు తగ్గించుకోవాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఎమిరేట్స్, కాథే పసిఫిక్ సంస్థలు నెల రోజులు జీతం లేని సెలవులు తీసుకోవాలంటూ తమ ఉద్యోగులకు స్పష్టం చేశాయి. కరోనా ధాటికి వచ్చే ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునేందుకు గానూ, ఎగ్జిక్యూటివ్‌ల జీతాలను 10 నుంచి 15 శాతం తగ్గించడమే కాకుండా, కొత్త నియామకాల ప్రక్రియలను పూర్తీగా నిలిపేశాయి. ఇక, కార్పొరేట్ సంస్థలు తమ మీటింగ్‌లను, బిజినెస్ ట్రిప్‌లను వాయిదా వేసుకోవడంతో, ప్రయాణాల డిమాండ్ భారీ స్థాయిలో తగ్గాయి. ఈ పరిణామాలతో విమానయాన రంగానికి రానున్న కాలంలో కష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
tags : aviation, CAPA, coronavirus