చెవిలో రంధ్రం ఉంటే.. కరోనా వచ్చే అవకాశం

by  |
చెవిలో రంధ్రం ఉంటే.. కరోనా వచ్చే అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతంది. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా… రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. అయితే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా, దగ్గు, తుమ్ముల ద్వారా సోకుతుంది. అయితే తాజాగా చెవి ద్వారా కరోనా రాదని, పేషెంట్‌కు చెవిలో రంధ్రం ఉన్నా.. ఇన్పెక్షన్ ఉన్నా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇది ఇప్పటివరకూ బయటపడలేదని తెలిపారు. మొదట్లో ముక్కు, గొంతు, ఊపిరి తిత్తుల ద్వారా కరోనా సోకుతుందని, ఈ మధ్య కాలంలో చెవి ద్వారా కూడా కరోనా వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ ఈఎన్‌టి డాక్టర్ నరేష్ ఓ మీడియాతో మాట్లాడుతూ… చెవి ద్వారా కరోనా రాదని, ఒకవేళ చెవిలో రంధ్రాలు ఉండి, ముక్కు, నోట్లో వేలు పెట్టి.. చెవిలో వేలు పెడితే అలాంటప్పుడు వైరస్ సోకే అవకాశం ఉందన్నారు.



Next Story

Most Viewed