- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వైరస్ చెవులను ఇన్‌ఫెక్ట్ చేస్తుందా?
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వైరస్ మహమ్మారి శాస్త్రవేత్తలకు రోజుకో సవాల్ విసురుతూనే ఉంది. ఇప్పటివరకు ముక్కు, గొంతు ద్వారా కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చెవుల ద్వారా కూడా కరోనా వ్యాపించే అవకాశాలున్నట్లు తాజా అధ్యయనంలో పరిశోధకులు కనుగొన్నారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ముగ్గురిపై చేసిన ఒక చిన్న అధ్యయనంలో, ఇద్దరికి మధ్య చెవుల్లోనే కాకుండా వెనుక చెవిలో కూడా అధిక వైరస్ ఉన‍్నట్టు గుర్తించారు. కొవిడ్-19తో మరణించిన రోగులపై హెడ్ అండ్ నెక్ శస్త్రచికిత్స విభాగం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చెవి వెనుక ఉన్న పుర్రె, చెవిలోని మస్టాయిడ్(కర్ణభేరి) ఎముకకు కూడా ఈ వైరస్ సోకుతుందని కొత్త పరిశోధన తేల్చింది.
80 ఏళ్ల మహిళకు కుడి మధ్య చెవిలో మాత్రమే వైరస్ రాగా, 60 ఏళ్ల వ్యక్తికి ఎడమ, కుడి కర్ణభేరితో పాటు ఎడమ, కుడి మధ్య చెవుల్లోనూ వైరస్‌ను గుర్తించామని తెలిపారు. అయితే కరోనా అత్యంత తీవ్రంగా ఉండేవారికి మాత్రమే చెవుల్లోకి ప్రవేశిస్తుందా? లేదంటే బయట నుంచి చెవుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందా? అనేదానిపై స్పష్టత లేదని, దీనిపై మరిన్నిపరిశోధనలు అవసరమని శాస్త్రేవేత్తలు భావిస్తున్నారు. అయితే.. కరోనా టెస్టులు చేస్తున్న వైద్య బృందాలకు.. చెవుల స్వాబ్‌ను కూడా పరిశీలించాలని ఈ అధ్యయన బృందం సూచించింది. అయితే గతంలో ( ఏప్రిల్, 2020) జరిగిన ఒక అధ్యయనంలో కరోనా రోగుల్లో చెవిపోటు, వినికిడి లోపం లాంటి లక్షణాలను కనుగొన్నారు. వినికిడి సమస్యలు లేనివాళ్లలో కూడా కరోనా సోకిన తరువాత వినికిడి శక్తిలో మార్పు వచ్చినట్లు మరి కొన్ని అధ్యయనాల్లో వెల్లడైన విషయం తెలిసిందే.