- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో 10 వేలు దాటిన కరోనా కేసులు
by Javid Pasha |
X
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఒక్కరోజే 1,805 కొత్త కేసులు నమోదయ్యాయి. 149(నాలుగు నెలలకు పైగా) రోజుల తర్వాత ఇవే అత్యధిక కేసులు కావడం ఆందోళనకరం. తాజా కేసుల్లో ఒక్క మహారాష్ట్ర నుంచే 397 నమోదవడం గమనార్హం. వైరస్ బారినపడి తాజాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10వేల మార్కును దాటిపోయింది.
ప్రస్తుతం 10,300 క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇక, దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.47కోట్లు(4,47,05,952) కాగా, మరణాల సంఖ్య 5,30,837కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19శాతంగా నమోదైంది.
Advertisement
Next Story